బంటుమిల్లి మండలం మూలపర్రు పంచాయతీ రామన్నమోడిలో దేవాలయ ప్రాంగణంలో బెల్టాపు నిర్వహణ కోసం వేలం పాట నిర్వహించడం వివాదానికి దారితీసింది. మహిళలు, గ్రామస్థులు వేలాన్ని అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. రూ. 93వేలతో వేలం ఖరారైనట్లు సమాచారం. అంగన్వాడీ కేంద్రం ఎదురుగా బెల్ట్ షాపు ఏర్పాటు చేయనున్నారనే ఆరోపణలతో గ్రామస్థులు పోలీసులు, ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు.