పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్, బంటుమిల్లి మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన యూనిట్ స్థాయి సమీక్ష సమావేశంలో పార్టీని మరింత పటిష్టపరిచే దిశగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. కార్యకర్తల మధ్య సమన్వయం ఉండాలని, పార్టీ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తోటి వారికి, ప్రజలకు తెలియపరచాలని, క్షేత్రస్థాయిలో రాజకీయాలపై పూర్తి అవగాహనతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.