విద్యార్థులను ప్రభుత్వ బడిలో చేర్పించండి.. ఉపాధ్యాయుల ఇంటింటి ప్రచారం

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరులోని పెనుగొలను హైస్కూలు ఉపాధ్యాయులు శుక్రవారం ఇంటింటికి వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న మెరుగైన వసతులు, ఆంగ్ల మాధ్యమం బోధన, ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం వంటి ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే కలిగే లాభాలను వివరిస్తూ, పిల్లలను చేర్పించాల్సిందిగా కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచేందుకు ఈ వినూత్న ప్రచార కార్యక్రమం చేపట్టారు.

సంబంధిత పోస్ట్