పెడన నియోజకవర్గం గూడూరు మండలం రాయవరంలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉద్ధాంటి దేవహర్ష (16) కాలువలో స్నానానికి దిగి మృతి చెందాడు. స్నేహితులతో కలిసి కాలువ వద్ద స్నానం చేస్తుండగా, చెప్పు నీటిలో పడిపోవడంతో దాన్ని తీసుకునేందుకు కాలువలోకి దిగిన అతడు ప్రమాదవశాత్తు మునిగి మృత్యువాత పడ్డాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.