తుపాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటన సందర్భంగా గూడూరులో మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం జగన్, ఒక్క రోజులో ఎన్యూమరేషన్ ఎలా పూర్తి చేయగలరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను ఆయన తప్పుబట్టారు. 30న ప్రొసీడింగ్స్ ఇచ్చి, 31లోపు ఎన్యూమరేషన్, సోషల్ ఆడిట్ పూర్తి చేయాలని ఆదేశించడం రైతులపై ప్రభుత్వానికి ఉన్న ప్రేమను తెలియజేస్తుందని జగన్ విమర్శించారు.