గూడూరులో అక్రమ మైనింగ్, ఇసుక రవాణాను అరికట్టేందుకు అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. అనుమతులు లేకుండా బుసక రవాణా చేస్తున్న ఒక వాహనాన్ని అదుపులోకి తీసుకుని, నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ. 2,000 జరిమానా విధించారు. మైనింగ్ మెటీరియల్ అక్రమ రవాణాపై RI జాన్సీ రాణి హెచ్చరికలు జారీ చేశారు. అనుమతులు లేకుండా తరలిస్తే వాహనాలను సీజ్ చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు.