గూడూరు రోడ్డులో పైడమ్మ గుడి రోడ్డు ఎదురుగా కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ డ్రైనేజీలో ఇరుక్కుని పక్కకు ఒరిగింది. బుధవారం ఉదయం కురిసిన అకాల వర్షానికి రోడ్లు జలమయం కావడంతో, టర్నింగ్ తీసుకునే సమయంలో డ్రైవర్ రోడ్డు మార్జిన్‌ను అంచనా వేయలేక రోడ్డు అంచు వరకు తిప్పడంతో రోడ్డు విరిగిపోయి, చక్రం డ్రైనేజీలో దిగబడిపోయింది.