గూడూరు: ఇంట్లోకి చొరబడి కత్తులు, కర్రలతో మహిళపై దాడి

గూడూరు మండలం పోసినవారిపాలెంలో ఓ మహిళపై కొందరు వ్యక్తులు దాడికి తెగబడ్డారు. పెడన డీ.టీ పాలెంకు చెందిన సాయి, శివ, కొండా, నాగమల్లి, తదితర బృందం కత్తులు, కర్రలతో తమ ఇంట్లోకి చొరబడ్డారని మహిళ వాపోయింది. తనను దుర్భాషలాడుతూ తీవ్రంగా గాయపరిచారని తెలిపింది. ఈ ఘటనపై బాధితురాలు ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గూడూరులో ఉద్రిక్తత నెలకొంది.

సంబంధిత పోస్ట్