కంకిపాడు: కారు బీభత్సం.. బాలుడి మృతి

కంకిపాడులో శనివారం కారు బీభత్సం సృష్టించింది. అంకమ్మతల్లి గుడి వద్ద వేగంగా వచ్చిన కారు ఆడుకుంటున్న బాలుడిని ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో మోక్షిత్ (7) అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. బాలుడి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్న దృశ్యాలు అందరిని కలిచి వేశాయి.

సంబంధిత పోస్ట్