కృత్తివెన్ను పోలీస్ స్టేషన్ పరిధిలోని నిడమర్రు గ్రామ సమీపంలోని మడ అడవుల్లో నాటు సారా తయారీ జరుగుతోందని సమాచారం అందడంతో, మంగళవారం కృత్తివెన్ను ఎస్ఐ ఏ. పైడి బాబు తన సిబ్బందితో కలిసి పడవలో అక్కడికి చేరుకున్నారు. పోలీసులు రాగానే సారా తయారీదారులు పరారయ్యారు. ఈ దాడిలో 40 లీటర్ల నాటు సారా, ప్లాస్టిక్ డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, సారా తయారీకి ఉపయోగించే 1000 లీటర్లకు పైగా బెల్లపు ఊటను ధ్వంసం చేశారు.