ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తామని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం కృతివెన్ను మండలం నిడమర్రు గ్రామంలో సుపరిపాలనకు తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేసి ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధిని, సంక్షేమాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.