కృత్తివెన్ను: ప్రభుత్వాన్ని నిలదీసిన జెడ్పిటిసి

జిల్లాలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై కృత్తివెన్ను జడ్పీటీసీ మైలా రత్నకుమారి సోమవారం ప్రభుత్వాన్ని నిలదీశారు. సామాన్యులకు, ఆక్వా రైతులకు డీజిల్ దొరకడం లేదని, అయితే మైనింగ్ మాఫియాకు ఎలా అందుతోందని ఆమె ప్రశ్నించారు. రైతుల అవసరాలను పక్కనపెట్టి ఇంధనాన్ని అక్రమ మార్గాలకు తరలిస్తున్నారని ఆమె ఆరోపించారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే, మంత్రి తక్షణమే స్పందించాలని ఆమె కోరారు.

సంబంధిత పోస్ట్