కృత్తివెన్ను: చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తాము

కృత్తివెన్ను మండలం చివరి ఆయకట్టు వరకు సాగునీరు, త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మరమ్మతులు లేక ఇబ్బందులు తలెత్తాయని ఆయన అన్నారు. శనివారం చినపాండ్రాక నుండి లక్ష్మీపురం వరకు కాల్వ త్రవ్వకం పనులు ప్రారంభించారు. బంటుమిల్లి కాల్వ చివరి ఆయకట్టు వరకూ సాగునీరు, ప్రతి గ్రామానికి త్రాగునీరు సమృద్ధిగా అందించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్