పెడన: పతాకాల వీరుడికి ఘనస్వాగతం

ఇటీవల నేపాల్‌లో జరిగిన ప్రపంచస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో 9 స్వర్ణ పతకాలు సాధించిన కృష్ణా జిల్లా పెడన పట్టణానికి చెందిన వరద భీమేశ్వరరావుకు పెడనలో అభిమానులు, ప్రజలు గురువారం ఘన స్వాగతం పలికారు. స్థానిక బస్టాండ్ సెంటర్ నుంచి ఆయన ఇంటి వరకు ర్యాలీ నిర్వహించి అభినందించారు. భారతదేశ కీర్తి ప్రతిష్టలను కాపాడేందుకు కృషి చేస్తానని భీమేశ్వరరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్