పెడన నియోజకవర్గం రామానుజ వర్తలపల్లి గ్రామంలో ఆదివారం చెరువు తవ్వకాలలో పురాతన కాలానికి చెందిన శ్రీ మహావిష్ణువు విగ్రహం బయటపడింది. ఈ సంఘటన గ్రామంలో ఆసక్తిని రేకెత్తించడంతో పాటు భక్తులలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని పెంచింది. గ్రామంలోని చెరువులో ప్రతి సంవత్సరం మాదిరిగానే పునరుద్ధరణ పనులు జరుగుతున్న సమయంలో, జెసిబితో తవ్విన మట్టిని ట్రాక్టర్లలో వేస్తుండగా, మట్టిని చదును చేస్తున్న ఒక కూలి వ్యక్తి ఈ శిల్పాన్ని గుర్తించారు.