పెడన: ఆక్వా చెరువుల వివాదం.. మహిళ ఆత్మహత్యాయత్నం

పెడన మండలం చెన్నూరు గ్రామంలో భూమి వివాదం కారణంగా నాగరాజు భార్య వెంకటలక్ష్మి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. 14 ఏళ్లుగా కౌలుకు భూమి చేసుకుంటున్న నాగరాజు, ఇటీవల ఆ భూమిని ఆక్వా చెరువు తవ్వకానికి మరొకరికి ఇవ్వడాన్ని అడ్డుకున్నారు. యజమాని ఫిర్యాదుతో పోలీసులు నాగరాజును అదుపులోకి తీసుకోగా, మనస్తాపానికి గురైన వెంకటలక్ష్మి విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం ఆమె మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సంబంధిత పోస్ట్