పెడన: కాలువలో పడిపోయిన ఆటో

వడ్లమన్నాడు నుండి సింగరాయపాలెం వెళ్లే ఆర్ అండ్ బి రోడ్డులో, వడ్లమన్నాడు దాటిన తర్వాత సాయిరాజు లంక కాలవపై వంతెన గోడ లేకపోవడం వల్ల సోమవారం రాత్రి ఒక ఆటో కాలవలో పడిపోయింది. అదృష్టవశాత్తు, అందులోని వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆర్ అండ్ బి అధికారులు వెంటనే వంతెన గోడలు నిర్మించాలని ప్రయాణికులు, ప్రజలు కోరుతున్నారు. కాలవలో పడిపోకుండా తమను కాపాడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్