జడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారికని సోమవారం మాజీ ఎంపీ మార్గాని భరత్, వైసీపీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు పరామర్శించారు. ఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్నా జిల్లా ప్రథమ పౌరురాలికే ఇలా జరిగిందంటే సామాన్య మహిళలకు ఈ ప్రభుత్వంలో ఎటువంటి న్యాయం జరుగుతుందోనని ఆవేదన వ్యక్తం చేశారు. వారి వెంట ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.