పెడన: పేకాట ఆడుతున్న ఐదుగురి మహిళలు అరెస్ట్

పెడన 1వ వార్డు పైడమ్మ లేఔట్లో నడుస్తున్న మహిళల జూద శిబిరంపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకుని రూ. 12,350 నగదు స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ గంటల సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. నాలుగు రోజుల క్రితం డీఎస్పీ బృందం చేసిన దాడిలో మహిళలు తప్పించుకున్న సంగతి తెలిసిందే. మహిళలు జూదంలో పట్టుబడటం జిల్లా స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత పోస్ట్