గుడివాడలో శనివారం జరిగిన దాడి ఘటనపై కృష్ణాజిల్లా పరిషత్ ఛైర్పర్సన్ ఉప్పాల హారికను వైసీపీ నాయకులు ఆదివారం పెడనలోని ఆమె నివాసంలో పరామర్శించారు. మాజీ మంత్రి తానేటి వనితతో పాటు పలువురు మహిళా నేతలు ఈ దాడి వివరాలను హారిక నుంచి అడిగి తెలుసుకున్నారు. కూటమి నేతలు అత్యంత పాశవికంగా దాడులకు పాల్పడుతుందని తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.