పెడన: యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

పెడనలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. తహశీల్దార్ కార్యాలయం సాక్షిగానే ఇతర మండలాలకు భారీగా బుసక తరలిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. నిన్న రాత్రి మచిలీపట్నం ఆర్డీవో కార్యాలయానికి ఫిర్యాదులు అందడంతో కొందరు వాహనదారులు పరారయ్యారు. అయినప్పటికీ నేడు మళ్లీ రవాణా కొనసాగడంపై అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు స్పందించి అక్రమ రవాణాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్