జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా వ్యాప్తంగా డ్రోన్ కెమెరాలతో జల్లెడ పడుతూ ఎక్కడికక్కడ అసాంఘిక అడ్డుకట్ట వేస్తున్నారు. సోమవారం సాయంత్రం పెడన పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద నందమూరు గ్రామ పరిధిలో పేకాట ఆడుతున్నారని తెలిసి డ్రోన్ కెమెరాతో గుర్తించారు. 5 మందిని అదుపులోనికి తీసుకొని వారి వద్ద నుండి రూ. 4వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ స్టేషన్ నందు వారిపై కేసు నమోదు చేశారు.