వాతావరణంలో ఆకస్మిక మార్పుల కారణంగా కృష్ణా జిల్లాలోని పెడన, బంటుమిల్లి, గుడ్లవల్లేరు వంటి పలు ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. గత కొద్ది రోజులుగా వేసవి తాపంతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనాన్ని కలిగించింది. చల్లని వాతావరణంతో ప్రజలు ఉపశమనం పొందారు.