కృష్ణా జిల్లా పెడనలో శుక్రవారం తెల్లవారు జాము నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం తీవ్రతకు రహదారులు నీటమునిగాయి. విద్యుత్కు అంతరాయం కలగడంతో పలు గ్రామాలు అంధకారంలో మగ్గిపోతున్నాయని ప్రజలు అంటున్నారు. ఎడతెరపిలేని వర్షంతో గృహాల్లోనే ఉండిపోయామన్నారు. వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.