ప్రజా సమస్యలపై ప్రశ్నించడం తప్పా అని మాజీ మంత్రి తానేటి వనిత కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదివారం సాయంత్రం పెడన పట్టణంలో జరిగిన బాబు ష్యురిటీ - మోసాలకు గ్యారెంటీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని, అందుకు నిదర్శనం జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారికపై దాడి జరగడమే నిదర్శనం అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు.