మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం సబబు కాదని జనసేన జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ అన్నారు. సోమవారం పెడనలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదు సంవత్సరాల వైసీపీ పాలనతో విసుగు చెందిన ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా వైసీపీ నేతలకు బుద్ధి రావటం లేదన్నారు. కార్యకర్తలను రెచ్చగొట్టి వారిని ఇబ్బందులకు గురి చేసేందుకు మాజీ మంత్రి నాని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.