పెడన: బావిలో పడి వ్యక్తి మృతి....!

పెడన పట్టణంలో సోమవారం రాత్రి వేములవాడ సాయికృష్ణ (47) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. మంగళవారం ఉదయం సమాచారం అందుకున్న పెడన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యుల రోదనలు హృదయవిదారకంగా ఉన్నాయి.

సంబంధిత పోస్ట్