పెడన: ఈనెల 30న పెడనలో మెగా జాబ్ మేళా

ఈ నెల 30న పెడనలోని బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డి. కె. బాలాజీ సోమవారం తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ జాబ్ మేళాలో ఎఫ్ట్రానిక్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, టాటా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని కలెక్టర్ తెలియజేశారు.

సంబంధిత పోస్ట్