పెడనలో టీడీపీ సీనియర్ మహిళా నేత కుర్షిద్ బేగం అంత్యక్రియలు శనివారం అత్యంత విషాదకర వాతావరణంలో జరిగాయి. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచిన ఆమెకు, శనివారం నిర్వహించిన అంత్యక్రియల్లో ఎమ్మెల్యే కాగిత పాల్గొని నివాళులర్పించారు. ఆమె మృతితో పెడన నియోజకవర్గ టీడీపీ శ్రేణుల్లో విషాదం నెలకొంది.