పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ గురువారం బంటుమిల్లి మండలంలోని మంథా తుఫానుతో దెబ్బతిన్న వరి పొలాలు, డ్రైన్లను పరిశీలించారు. పెద్ద తుమ్మిడి మేజర్ డ్రైన్ లో పూడుకుపోయిన చెత్తను తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. తుఫాను వల్ల ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగలేదని, రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణపై అధికారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీసీ చైర్మన్ బొర్రా కాశీ, నాయకులు, కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.