పెడన మండలం కూడూరు గ్రామంలో పెడన నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ఉప్పాల రాము, కృష్ణ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారికలను ఆదివారం ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ పరామర్శించారు. గుడివాడలో శనివారం సాయంత్రం జరిగిన ఘటన గురించిన వివరాలను ఆయన హారికను అడిగి తెలుసుకున్నారు. జనసేన, తెలుగుదేశం పార్టీ నేతలు గుండాల వివరించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఈ ఘటనపై తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు.