పెడన నియోజకవర్గంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ తెలిపారు. నియోజకవర్గంలోని 4 మండలాల్లో లో-వోల్టేజ్ సమస్య లేకుండా పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని, పెడన, బంటుమిల్లి సబ్స్టేషన్లు త్వరలో అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. కొత్త విద్యుత్ లైన్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామని ఆయన స్పష్టం చేశారు.