పెడన నియోజకవర్గంలో ఆదివారం జరిగిన కార్యక్రమాలు ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. నియోజకవర్గంలో వైసిపి నిర్వహించిన బాబు షూరిటీ - మోసాలకు గ్యారెంటీ కార్యక్రమం, టిడిపి ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ నిర్వహించిన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం ఒక్కరోజే జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కృష్ణాజిల్లాలో జరుగుతున్న పరిణామాలు నేపథ్యంలో పోలీసులు ఎప్పటికప్పుడు బందోబస్తు ఏర్పాటు చేశారు.