పెడన: దొంగనోట్లు ముద్రిస్తున్న ముఠాకు చెక్ పెట్టిన పోలీసులు

కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం సంగముడిలోని ఓ వైన్ షాపులో దొంగనోట్లు గుర్తించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తులో భాగంగా రంజిత్ సింగ్, శంకర్, దీలిప్ అనే ముగ్గురు వ్యక్తులు దొంగనోట్లు ముద్రిస్తున్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 6 లక్షల 2,400 రూపాయల నకిలీ నోట్లు, ప్రింటింగ్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు బుధవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్