పెడన నియోజకవర్గంలో ఆదివారం సాయంత్రం జరిగిన బాబు షూరిటీ - మోసాలకు గ్యారెంటీ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల పార్టీ శ్రేణులకు వైసిపి ఇన్చార్జ్ ఉప్పాల రాము సోమవారం ఉదయం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజల పక్షాన పోరాటం చేయడానికి తాము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.