పెడన: చేనేత కార్మికులకు తీవ్ర నష్టం

తుఫాన్ కారణంగా చేనేత పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లిందని, చేనేత కార్మికులు తీవ్రంగా నష్టపోయారని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. శనివారం సాయంత్రం సచివాలయ సిబ్బందితో ఆయన చేనేత పరిశ్రమ నష్టంపై సమీక్ష నిర్వహించారు. ఒక చేనేత కార్మికుడు మగ్గం సామాగ్రి సమకూర్చుకుని, మగ్గాన్ని సరిచేసుకోవడానికి సుమారు 15 రోజులు పడుతుందని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆ చేనేత కుటుంబాలకు నష్టపరిహారం అందిస్తుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్