పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకొని, పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి మహిళా మండలి, కేసిజిఎఫ్ వాసవి క్లబ్, పొట్టి శ్రీరాములు పెడన వారి నేతృత్వంలో స్థానిక శ్రీ వాసవి క్షేత్రంలో ఆర్యవైశ్య బాల బాలికల కోసం సంధ్య గొబ్బెమ్మలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 30 మంది బాల బాలికలతో కలిసి శ్రీ వాసవి క్షేత్రం ఆలయ ప్రధాన అర్చకులు స్వర్ణ సాయిబాబు శుక్రవారం భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.