ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలు అన్నీ అమలు చేస్తామని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం ఉదయం పెడన ఐదో వార్డులో 'సుపరిపాలనకు తొలి అడుగు-ఇంటింటికి తెలుగుదేశం పార్టీ' కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతి ఇంటిని సందర్శించి ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.