పెడన: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది

రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైయస్సార్సీపి రాష్ట్ర నాయకులు దేవినేని అవినాష్ విమర్శించారు. మంగళవారం పెడనలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ మహిళ అని కూడా చూడకుండా టిడిపి, జనసేన నాయకులు గుడివాడలో జడ్పీ చైర్పర్సన్ హారికపై దాడికి పాల్పడడం దుర్మార్గం అన్నారు. బండ బూతులు తిడుతూ కారులో నుంచి బయటికి రాకుండా అద్దాలు పగలగొట్టి భయభ్రాంతులకు గురి చేశారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్