పెడన: మడకలో దొంగతనం.. పోలీసులకు పిర్యాదు

పెడన మండలం మడకలో ఆదివారం గుర్తు తెలియని దుండగులు కారులో వచ్చి గ్రామానికి చెందిన మురాల బాజీకి చెందిన 3 పందెం కోడిపుంజులు, జోగి వెంకన్నకు చెందిన ఒక గొర్రెపోతును దొంగిలించినట్లు పెడన పోలీసులకు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ, కారులో వచ్చిన దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్