మహిళలను గౌరవించలేని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద రెడ్డి అన్నారు. సోమవారం మీడియాకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక రాము దంపతులపై కూటమి నేతలు చేసిన దాడి రాష్ట్రం మొత్తం ఖండించాల్సిన ఉందన్నారు. జిల్లా ప్రథమ పౌరాణిపై ఈ విధంగా ప్రభుత్వంలో జరిగితే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.