పెడన మండలం బల్లిపర్రులో ఆదివారం ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొట్టుకున్నాయి. బంటుమిల్లి వైపుకు వెళుతున్న ఈ ఘటనలో లారీ డ్రైవర్లు ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే వారిని 108లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఓ లారీ ముందు భాగం నుజ్జు అయ్యింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.