ప్రజలకు అండగా ఉంటాం, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు. ఆదివారం పెడన టౌన్ 12వ వార్డులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో జరిగింది. టీడీపీ కూటమి పాలనలో ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఉన్నారని, అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. తల్లికి వందనం, మత్స్యకార భృతి పెంపు పథకాల అమలు చేస్తున్నామన్నారు.