రావిగుంట: చెరువు తవ్వకంపై గ్రామస్థుల ఆందోళన

బంటుమిల్లి మండలం రావిగుంట గ్రామంలో ఓ రైతు చెరువు తవ్వకానికి సిద్ధం కాగా, గ్రామస్థులు అడ్డుకున్నారు. చుట్టుపక్కల పంట పొలాలు దెబ్బతినే ప్రమాదం ఉందని, గ్రామానికి తాగునీరు అందించే బావులు కలుషితమయ్యే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది కూడా ఇదే సమస్య తలెత్తగా, రైతుల అభిప్రాయాలు సేకరించకుండా అనుమతులు ఎలా ఇస్తారని గ్రామస్థులు ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్