ప్రతిష్టాత్మకంగా రోడ్ల మరమ్మతులు, నిర్మాణ పనులు: ఎమ్మెల్యే కాగిత

రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులు, నిర్మాణ పనులను కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు. బుధవారం పెడన నియోజకవర్గం పరిధిలోని నడుపూరు రోడ్డు, నేలకొండపల్లి నుండి లంకలకలాగుంట మీదుగా జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అధికారంలోకి రాగానే రాష్ట్రంలో రోడ్లకు పూర్వ వైభవం తెచ్చేలా ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్