కంకిపాడు: 485 టార్పాలిన్ పట్టాలు అందజేత

దిత్వా తుఫాన్ నేపథ్యంలో, రైతుల సౌకర్యార్థం 485 టార్పాలిన్ పట్టాలను పంపిణీ చేసినట్లు వ్యవసాయాధికారి ఉషారాణి ఆదివారం తెలిపారు. తుఫాన్ నుంచి పంటను రక్షించుకోవడంపై మండల ప్రత్యేక అధికారి రత్నచార్యులు, వ్యవసాయాధికారి ఉషారాణి రైతులకు అవగాహన కల్పించారు. పునాదిపాడు, కోలవెన్ను, కుందేరు గ్రామాల్లో ధాన్యం బస్తాలను మిల్లులకు తరలించాలని సూచించారు. అలాగే, కోత కోయకుండా మూడు రోజులు పాటు రైతులు ఆగాలని కూడా వారు సూచించారు.

సంబంధిత పోస్ట్