కంకిపాడు మండలంలోని మద్దూరు, కెవి. పాలెంల పరిధిలో నదిలో వరద ఉధృతి గురువారం రాత్రికి మరింత పెరిగింది. పులిచింతల ప్రాజెక్టు నుండి దిగువకు సుమారు 3లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో ఆ వరద నీరంతా ప్రకాశం బ్యారేజీకి చేరుకోవడంతో ప్రస్తుతం బ్యారేజీ వద్ద గరిష్ట నీటిమట్టం నమోదైంది. నదీ పరివాహక ప్రాంతాలలో రెడ్ ఎలర్ట్ ను ప్రకటించి, అధికారులు అప్రమత్తమయ్యారు. గంట గంటకు వరద ఉధృతి పెరుగుతుంది.