కృష్ణానదిలో వరద ఉధృతి మరింతగా పెరుగుతోంది. బుధవారం సాయంత్రానికి కంకిపాడు మండలం మద్దూరు, కాసరనేనివారిపాలెం వద్ద లంక భూములకు వరద నీరు చేరింది. మత్స్యకారులు పడవలను ఒడ్డుకు చేర్చి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి నీటి విడుదల పెరుగుతుండటంతో అన్ని శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. పుచ్చల లంక గ్రామం పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. కరకట్ట మార్గాలవైపు ప్రవాహం కొనసాగుతోంది.