కంకిపాడు: వైసిపి ఇన్ ఛార్జ్ పై జనసేన నేత ఆగ్రహం

పెనమలూరు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి దేవభక్తుని చక్రవర్తిపై జనసేన నాయకుడు ముప్పా రాజా మండిపడ్డారు. ఆదివారం కంకిపాడులో ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చక్రవర్తిని నోరు అదుపులో పెట్టుకోమని హెచ్చరించారు. ఆయనకు ఎటువంటి రాజకీయ అనుభవం లేదని, గతంలో ఎప్పుడు అతని పేరు వినలేదని ఏద్దేవా చేసారు. మరో సారి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన బుద్ది చెబుతామని తెలిపారు.

సంబంధిత పోస్ట్