కంకిపాడు పాత గవర్నమెంట్ ఆసుపత్రి సమీపంలో శుక్రవారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. షాపు నెం. 6 నుండి 250 కేజీల బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తుండగా స్థానికులు అడ్డుకుని అధికారులకు సమాచారం అందించారు. పిడిఎస్ స్పెషల్ డిప్యూటీ తహశీల్దార్ ప్రధాన్ ఆధ్వర్యంలో జరిగిన తనిఖీల్లో రేషన్ షాపు రికార్డుల్లో తప్పులు గుర్తించి, కేసు నమోదు చేశారు.